సీఎం కేసీఆర్ ప్లెక్సీ దగ్ధం చేసిన యువజన కాంగ్రెస్ నేతలు..

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నాడని నల్గొండ వైస్ ఎంపీపీ, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్ మండిపడ్డారు.వరంగల్ జోడో యాత్రలో యువజన కాంగ్రెస్ నేత పవన్ పై బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడానికి నిరసిస్తూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ ప్లెక్సీని దద్దం చేసి,కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 Youth Congress Leaders Burnt Cm Kcr Flexi, Youth Congress Leaders ,cm Kcr Flexi,-TeluguStop.com

దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వైస్ ఎంపీపీ పరమేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ లో యువజన కాంగ్రెస్ నాయకుడు పవన్ పై బీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడడం శోచనీయమని అన్నారు.

ప్రభుత్వ విధానాలను ఎండగడితే దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు.ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.మోసపూరిత హామీలతో పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కు తగిన గుణపాఠం తప్పదని అన్నారు.

ప్రజా విశ్వాసం కోల్పోయిన తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని అందుకే ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని,ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్లపల్లి గౌతం,గిరి,రాజు,కన్నా, ముజ్జు,పుట్ట చందు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube