సూర్యాపేట జిల్లా:హెలెన్ ఆడమ్స్ కెల్ల( Helen Adams Keller )ర్ జీవితం వికలాంగుల సమాజానికి స్ఫూర్తిదాయకమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య ( Arvapalli Lingaiah )అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హెలెన్ ఆడమ్స్ కెల్లర్ 244వ,జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ( America )దేశంలో పుట్టిన హెలెన్ కెల్లర్ తన జీవితాంతం అంధులకు అండగా ఉన్నారని,అంధులను ఆదుకునేందుకు 34 దేశాలలో సేవ చేశారని,సంవత్సరన్నర వయసులోనే రెండు కళ్ళు పోయినా నిరుత్సాహ పడకుండా ఉన్నత చదువులు చదువుకున్నారని గుర్తు చేశారు.వికలాంగులు తాము వికలాంగులమని బాధపడకుండా హెలెన్ కెల్లర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క వికలాంగుడు కృషి చేయాలని కోరారు.
మహిళలు సమాజంలో సగ భాగంగా ఉన్నారని,మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు.నాటి స్వాతంత్రోద్యమ కాలం నుండి నేటి వరకు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు శిరంశెట్టి రామారావు, ఉపాధ్యక్షుడు సంతోష్,జిల్లా కమిటీ సభ్యులు కప్పల సత్యం,నల్లమేకల రామ్ కుమార్,ఎస్.వనిత,అరుణ, ఉమా తదితరులు పాల్గొన్నారు.