నల్లగొండ జిల్లా:జూన్ 4 న కేరళను( Kerala ) తాకాల్సిన రుతుపవనాలు మరో 3-4 రోజులు ఆలస్యంగా రానున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండి) వెల్లడించింది.కేరళ చేరిన తర్వాత వారం రోజులకు రాయలసీమ, 10-12 రోజులకు తెలంగాణాపై విస్తరిస్తాయి.
అరేబియా సముద్రంపై( Arabian Sea ) దట్టమైన మేఘ సమూాహాలు కనిపిస్తున్నాయి.పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నందున ఆలస్యమైనా వర్షాలకు కొదవ ఉండదని ఐఎండి అంచనా వేస్తోంది.
గత ఏడాది మే 31 నే మాన్సూన్ కేరళను పలకరించింది.గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి వారం పైగా ఆలస్యమవుతున్నట్టే లెక్క.