సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల( Garidepalli ) కేంద్రంలో 65వ,జాతీయ రహదారి పొడవునా ఉన్న లైట్స్ గత నాలుగు రోజులుగా వెలగడం లేదని,లైట్స్ వెలగక( Lights ) పోవడంతో రోడ్డు మొత్తం అంధకారంతో నిండిపోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైవే పై వాహనాల( Vehicles ) రాకపోకలు అర్థంకాక ప్రమాదాలు జరుగుతున్నాయని,చీకట్లో ప్రయాణికులు,గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.
గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.