సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు 18 ఏళ్లుగా ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని,విధి నిర్వహణలో మరణించిన ఆశ వర్కర్లకు ఎక్స్గ్రేషియా తో పాటు ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని,
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి మూల స్తంభంగా నిలిచిన ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వీడని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అందిస్తున్న సేవలకుగాను ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఏ మాత్రం సరిపోవడం లేదని,కనీస వేతనం ఇచ్చేవరకు పారితోషకాలను క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు.