సూర్యాపేట జిల్లా: జిల్లాలో ఈ నెల 30 న జరిగే ఎన్నికల సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆయా నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ తెలిపారు.80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు,వికలాంగులు ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో భాగంగా మొదటి రోజున సూర్యాపేట నియోజకవర్గంలో 136 మంది వృద్ధులు,79 మంది వికలాంగులు,కోదాడలో 96 మంది వృద్ధులు,
17 మంది వికలాంగులు, హుజూర్ నగర్ లో 67 మంది వృద్ధులు,39 మంది వికలాంగులు,ఇద్దరు ఎస్సెన్సియల్ సర్వీసెస్, తుంగతుర్తిలో 112 మంది వృద్ధులు,39 మంది వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో మొత్తం 411 మంది వృద్ధులు,174 మంది వికలాంగులు, ఇద్దరు ఎస్సెన్సియల్ సర్వీస్ పర్సన్స్ కలుపుకొని మొత్తం 587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.