పేటలో పందులు స్వైర విహారం

సూర్యాపేట జిల్లా:పేట మున్సిపాలిటీ సూర్యాపేట శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో పట్టణంలో పందులు స్వైరవిహారం చేయడం పలువురిని ఇబ్బందులకు గురిచేస్తుంది.పేట మున్సిపాలిటీ 16వ వార్డులో అక్షయ అపార్టుమెంట్ వెనుకాల వీధిలో పందుల సంచారం వార్డు ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.

 Pigs Roam Freely In Peta-TeluguStop.com

ఈ ప్రాంతంలో ఇంటిగేటు తీసుంటే చాలు పందులు ఇంటిలోకొచ్చి మొక్కలను,సామగ్రిని ధ్వంసం చేస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నాయని వార్డు వాసులు వాపోతున్నారు.పందుల సంచారం పెరగడం వలన వాటి నుండి వెలువడే దుర్గంధం వలన ఇంటిలోని నుండి బయటికి రావాలంటే ఇబ్బందిగా మారిందని,పందుల వలన మెదడు వాపు వ్యాధి సంక్రమించే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి పట్టణంలో పందుల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube