ప్రమాదకరంగా మూసి బ్రిడ్జి-రోడ్డెక్కిన స్థానికులు

నల్లగొండ జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలం శూన్యంపహాడ్ ముసిపై నిర్మించిన పురాతన బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని శనివారం స్థానికులు రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా పలువురు మాట్లడుతూ బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి,అందులో నీళ్లు నిలిచి ప్రమాదకరంగా ఉందని,ద్విచక్ర వాహనాల ఆ రోడ్డుపై వెళ్తే ఇంటికి వెళ్తామనే గ్యారెంటీ లేదని,కనీసం పాదాచారులు కూడా నడవలేని దుస్థితి నెలకొంది వర్షాకాలంలో ఆ గుంతల్లో నీళ్లు నిలిచి ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

 Dangerously Closed Bridge-road Locals-TeluguStop.com

ఈ బ్రిడ్జిపై నుండి పెన్నా,డెక్కన్ సిమెంట్ భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి.కానీ,ఇక్కడ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం కంపెనీలకు గుర్తుకు రావు,రాత్రి వేళలో ఈ బ్రిడ్జిపై ప్రయాణం సాగించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలని అన్నారు.

స్థానిక గ్రామస్తులు వరి ధాన్యం మార్కెట్ కి తరలించాలి అంటే ఈ బ్రిడ్జిపై ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారని,బంగారు తెలంగాణలో మూసి పై నిర్మించిన పురాతన బ్రిడ్జి మరమ్మతులు చెయ్యలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.ఇప్పటికైనా స్థానిక నేతలు పట్టించుకోని బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube