యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం చేసుకుని వస్తున్న తనపై ఎస్పీఎఫ్ సిబ్బంది చేయి చేసుకున్నారని యాదగిరిగుట్టకు చెందిన ఎల్ల స్వామి అనే భక్తుడు విలేకరులకు తెలిపారు.బ్రేక్ దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా ఇతర భక్తులు దర్శనం గురించి కొన్ని వివరాలు అడుగుతుండగా ఎస్పీఎఫ్ సిబ్బంది నీవు ఇక్కడ ఎందుకున్నావ్,ఇక్కడ ఏమి పని అంటూ తనపై చేయి చేసుకున్నారని అన్నారు.
అంతేకాక ఎస్పీఎఫ్ సిబ్బంది నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ తనపై చేయి చేసుకున్నారని అవేదన వ్యక్తం చేశారు.తనపై చేయి చేసుకున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని,లేనిచో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించాడు.
తను దళితుడినని ఉద్దేశంతోటే ఆలయంలోకి రానీయకుండా చేస్తున్నారని ఆరోపించారు.ఈ విషయమై ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణను అడుగగా అతనిపై నేను చేయి చేసుకోలేదని,నీవు ఎక్కడ ఉంటావు అనే వివరాలు మాత్రమే అడిగానని చెప్పడం గమనార్హం.







