సూర్యాపేట జిల్లా:ప్రమాదవశాత్తు కింద పడి భుజానికి గాయం కావడంతో ప్రైవేట్ హాస్పిటల్ చేరిన వ్యక్తికి ఆపరేషన్ కోసం మత్తు సూది అధిక మోతాదులో ఇవ్వడంతో బీపీ లెవల్స్ పెరిగి మృతి చెందిన విషాదఘటన కోదాడ పట్టణంలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన టైలర్ పోరెళ్ల ఉపేందర్ (38)కింద పడి భుజానికి దెబ్బ తగలడంతో ఆదివారం కోదాడ లోని సురేష్ కుమార్ ఆర్తో ఎండ్ స్కిన్ కేర్ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు.
అతనికి సర్జరీ చేయాలని చెప్పారు.సోమవారం సర్జరీ సమయంలో ఇవ్వాల్సిన మత్తు ఇంజక్షన్ ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో బీపీ పెరిగి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.నిర్లక్ష్యంగా మత్తు సూది చేసి ఉపేందర్ మరణానికి కారణమైన హాస్పిటల్ పై మృతుడి బంధువులు స్వల్పంగా దాడిచేసి హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.
దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది,విచారణ చేపట్టారు.