సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండలం( Chintala Palem )లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ సైదిరెడ్డి కోరారు.కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని బైక్ రైడింగ్,త్రిబుల్ రైడింగ్ చేయడం,ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం,రాకపోకలకు అంతరాయం కలిగించడం, భారీ స్పీకర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం,రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇలాంటి వాటిని అరికట్టడానికి తమ సిబ్బందిని అన్ని ప్రదేశాల్లో నిఘా ఉంచామన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్సై వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకలను( New Year celebrations ) ప్రశాంత వాతావరణంలో,ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మండల ప్రజలకు ఎస్ఐ సైదిరెడ్డి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.