సూర్యాపేట జిల్లా:ప్రజా వ్యతిరేకతను గమనించినా కూడా సక్రమంగా పనిచేయడం చేతగాక ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సమస్యను సృష్టించి వ్యతిరేకతను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను రాజకీయానికి వాడుకొని ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు పార్టీ పేరులో తెలంగాణ అనే పదమే లేకుండా చేసుకున్నారని,పార్టీ పేరు మార్చుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వంపై,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గిపోదన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అండతో టిఆర్ఎస్ నాయకులు వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు.ఇప్పటివరకు తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించలేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా యోజన పథకం ద్వారా పంట నష్టపరిహారాన్ని రైతులు అందుకునే అవకాశం ఉన్న కూడా ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు.
ధరణి పోర్టల్ తీసుకువచ్చి పచ్చని పల్లెలో రైతుల మధ్య భూమి పంచాయతీలు పెట్టారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోకల రాములు,జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల వెంకటరెడ్డి,పోకల వెంకటేశ్వర్లు, రాపర్తి శ్రీనివాస్ గౌడ్,జిల్లా నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి,సంధ్యాల సైదులు,గార్లపాటి మమతారెడ్డి,బూర మల్సూర్ గౌడ్,పందిరి రామ్ రెడ్డి,వెన్న శశిధర్ రెడ్డి,బిట్టు నాగరాజు,రాపర్తి రాము,కొప్పుల క్రాంతిరెడ్డి,బోర రమేష్ లు పాల్గొన్నారు.