టాలీవుడ్ స్టార్ హీరోలుగా తారక్, చరణ్ లకు మంచి గుర్తింపు ఉంది.తారక్, చరణ్ వేర్వేరుగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
తారక్ తనకు గతంలో సక్సెస్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తుండగా చరణ్ మాత్రం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.తాజాగా బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే చరణ్, తారక్ మధ్య ఉన్న ఒక కామన్ పాయింట్ గురించి తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.చరణ్, తారక్ ఏ మూవీ ఈవెంట్ కు హాజరైనా ఆ మూవీ సక్సెస్ సాధిస్తుండటం గమనార్హం.
రామ్ చరణ్ కేజీఎఫ్2, విక్రాంత్ రోణ, విక్రమ్, ఒకే ఒక జీవితం సినిమాల ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లకు హాజరు కాగా ఈ సినిమాలన్నీ ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించడం గమనార్హం.
మహానటి, భరత్ అనే నేను, బ్రహ్మాస్త్ర, బింబిసార సినిమాల ఈవెంట్లకు తారక్ హాజరు కాగా ఈ సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చరణ్, తారక్ ఈవెంట్లకు హాజరైతే సినిమా సక్సెస్ సాధిస్తుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఈ ఇద్దరు హీరోలు తమ క్రేజ్ కు అనుగుణంగా మార్కెట్ ను పెంచుకుంటూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

తారక్, చరణ్ రియల్ లైఫ్ లో మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.తారక్, చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలలో కలిసి నటిస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.తారక్, చరణ్ లకు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.







