సంతోషిమాత ఆలయంలో రూ.కోట్ల అవినీతి:కూనపరెడ్డి సంతోష్ నాయుడు

సూర్యాపేట:జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన సంతోషిమాత ఆలయాన్ని వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని,దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగిస్తామంటూ కాలం వెళ్లదీస్తూ నేటి వరకు ప్రభుత్వానికి అప్పగించకుండా ఆలయ ప్రధాన కార్యదర్శి బ్రహ్మండ్లపల్లి మురళీధర్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సమాచార హక్కు న్యాయ రక్షణ చట్టం 2005 జాతీయ చైర్మన్ కూనపరెడ్డి సంతోష్ నాయుడు ( Koonapareddy Santosh Naidu )ఆరోపించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 Corruption Of Rs Crores In Santoshimata Temple Koonapareddy Santosh Naidu , Koon-TeluguStop.com

సుమారు 30 ఏళ్ల క్రితం బ్రాహ్మణపల్లి మురళీధర్( Brahmanapalli Muralidhar ) తల్లి మణెమ్మ పేరుతో 20 చతర గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆలయం నేడు వెయ్యి గజాలకు చేరిందని, ఆక్రమించిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపించారు.ప్రతియేటా కార్తీకమాసంలో రూ.కోటి వరకు వసూలు చేస్తూ అందులో రూ.80 లక్షలు వెనుకేసుకుంటూ రూ.20 లక్షలు మాత్రమే ఖర్చు పెడుతున్నారన్నారు.కనీసం ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం కూడా సరిగ్గా పెట్టని దౌర్భాగ్య పరిస్థితి ఉందన్నారు.

బంగారు వస్తువుల విషయం ఇక చెప్పాల్సిన పని లేదన్నారు.ఎండోమెంట్ అధికారులు ఆలయాన్ని తమ శాఖకు అప్పగించాలని కోర్టుకు వెళ్లగా కోర్టు స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ,ఆలయ కమిటీ పేడచెవిన పెడుతుందన్నారు.

సుమారు 120 కిలోల వెండి మొత్తం ఆయన ఇంట్లోనే ఉందని,ఇందుకు సంబంధించి గుమస్తా వసూళ్లకు పాల్పడుతూ లక్షకు పదివేల కమిషన్ తీసుకుంటున్నట్లు వివరించారు.ఈ వసూళ్లు ఇటీవల పెరిగి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కోట్ల రూపాయల కూడబెట్టుకొని కొడుకులు బిడ్డల పేరుపై ఆస్తులు కొనుగోలు చేసి అద్దెలకు ఇస్తున్నట్లు ఆరోపించారు.

సంతోషిమాత ఆలయం విషయంలో కమిటీ చేస్తున్న అవినీతిపై హైకోర్టుకు కూడా వెళ్ళనున్నట్లు వివరించారు.సమావేశంలో సమాచార హక్కు న్యాయ రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, జాయింట్ సెక్రెటరీ రాపర్తి సురేష్, ఆధ్యాత్మికవేత్త డేగల సాగర్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube