తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్( CM KCR ) వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం.
ఆయన ప్రణాళికలు ప్రత్యర్థి పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.అందుకే కేసిఆర్ ను ఎవరు కూడా తక్కువగా అంచనా వేయరు.
గత ఎన్నికల టైమ్ లో కేసిఆర్ ను గద్దె దించాలని ఆయా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే.ఎవరు ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి అందరికీ షాక్ ఇచ్చారు.
ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యర్థుల అంచనాలు తలకిందులు చేస్తూ కేసిఆర్ వ్యూహాలు సాగుతూ వచ్చాయి.ఇక ఈసారి కూడా కేసిఆర్ తనదైన రీతిలో వ్యూహాలకు పదను పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మద్య బిఆర్‌ఎస్ నుంచి చేరికలను భారీగా ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ పార్టీ.ఇదే రీతిలో కొనసాగితే కాంగ్రెస్( Congress party ) బలం పెరుగుతుందని, బిఆర్‌ఎస్ కు దెబ్బ తీయవచ్చని హస్తం నేతలు భావిస్తున్నారు.అటు బీజేపీ కూడా బిఆర్‌ఎస్ నుంచి చేరికలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది.అయితే చేరికల విషయంలో పైపైకి సైలెంట్ గా ఉన్న లో లోపల మాత్రం కేసిఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలలోని అసంతృప్త నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ప్రస్తుతం హడావిడి చేస్తున్న కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసిఆర్ వ్యూరచరణ చేస్తునట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ కు చెందిన భువనగిరి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి( Anil Kumar Reddy ) ఇటీవల గులాబీ గూటికి చేరారు.

ఈయన దారిలోని మరికొంత మంది బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నాట్లు టాక్.ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్ లోకి వచ్చే వారికి కుదిరితే ఎమ్మెల్యే సీటు లేదా ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసిఆర్ ఒకే చెప్పినట్లు టాక్.అందుకే అందుకే బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి సీట్ల కోసం ఎదురు చూస్తున్న నేతలు వేరే ఆలోచన లేకుండా బిఆర్‌ఎస్ గూటికి చేరేందుకు సిద్దమౌతున్నారట.
కాగా అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం బిఆర్‌ఎస్ లో భయం పుట్టించేందుకు చేరికలను బహిర్గతం చేస్తుంటే కేసిఆర్ మాత్రం చపాకింద నీరులా రెండు పార్టీలకు జరగాల్సిన నష్టం జరిగేలా వ్యూహాలు రచిస్తున్నారు.మరి ఎన్నికల సమయానికి కేసిఆర్ తన చతురతతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తారో చూడాలి.