కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి: టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పొనుగోటి కోటయ్య

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్)( Telangana Progressive Teachers Federation ) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పొనుగోటి కోటయ్య అన్నారు.

బుధవారం అనంతగిరి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరవధిక సమ్మె చేస్తున్న జేపిఎస్ లకు టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు రామినేని విజయ్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు.

అనంతరం టిపిటిఎఫ్ నాయకులు( TPTF Leaders ) రాపర్తి రామనరసయ్యతో కలిసి ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ నిర్మించి ప్రకటించాలని,యూపీఎస్ లను జేపీఎస్ లుగా మార్చాలని,విధి నిర్వహణలో మరణించిన జెపిఎస్,యుపిఎస్ కుటుంబాలకు కారణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న 10 వేల మంది పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను వారితో చర్చించి తక్షణమే పరిష్కరించాలన్నారు.

పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సంఘపక్షాన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి రామినేని విజయ్,ఎన్.

సుధాకర్ కోదాడ మండలం శాఖ అధ్యక్షులు బడుగుల సైదులు,జెపిఎస్ అధ్యక్షులు బి.వెంకటేష్, సంఘం నాయకులు తేజ,వెంకటేష్,వీరప్రభకర్, సతీష్,శ్రీనివాస్,స్వాతి, త్రివేణి,సునిత,రజిత,గోపి హజ్మతలి,సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News