ఈజీ ఇన్స్టాల్మెంట్ పేరుతో మహిళలకి టోకరా...!

సూర్యాపేట జిల్లా:మహిళలే టార్గెట్ గా తక్కువ డబ్బులకు ఎక్కువ బహుమతులు వస్తాయని నమ్మబలికి, వారవారం డబ్బులు కట్టించుకుని చివరకు కనిపించకుండా పరారైన సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే… అనంతగిరి మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో శరణ్య ఈజీ ఇన్స్టాల్మెంట్,శ్రీ సాయిబాబా ఈజీ ఇన్స్టాల్మెంట్ పేర్లతోమహిళలను టార్గెట్ గా చేసుకొని విలువైన వస్తువులకు మా వద్ద మంచి ఆఫర్లు,డిస్కౌంట్లు ఉన్నాయంటూ నమ్మబలికి ప్రతివారం డబ్బులు కట్టించుకొని చివరికి ఉడాయించారని బాధిత మహిళలు బోరున విలపిస్తున్నారు.

 Fraud For Women In The Name Of Easy Installment , Fraud , Easy Installment, Sur-TeluguStop.com

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లడుతూతాము ఫలానా ఆఫీస్ నుండి వచ్చామని ప్రతివారం కొంత నగదు కట్టుకోవాలని,ప్రతి గురువారం లక్కీ డ్రా( Lucky draw ) తీస్తామని నమ్మబలికించారని, మొదటగా కొన్ని వారాలు లక్కీ డ్రా తీశారని,ఎక్కువ మంది మహిళలను ఆకర్షించేందుకు లక్కీ డ్రాలో చిన్న చిన్న బహుమతులను అందించారని,దీంతో పూర్తిస్థాయిలో మహిళలు నమ్మి అధిక సంఖ్యలో చేరి ప్రతి వారం వాళ్లకు డబ్బులు చెల్లించామని అన్నారు.

సుమారు రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు కట్టినట్లు,ఇదే అదునుగా వ్యాపారులు ఇతర గ్రామాలలో కూడా భారీగా మహిళలను చేర్చుకుని,లక్షల్లో ఇన్స్టాల్మెంట్ వాళ్లకు కట్టినట్టుగా సమాచారం.

కొన్ని రోజులుగా ఈజీ ఇన్స్టాల్మెంట్( Easy Installment ) వాళ్లు చరవాణి ద్వారా స్పందించకపోవడం, గ్రామాల్లో రాకపోవడంతో ఘరానా మాఫియా చేతిలో మోసపోయామని గ్రహించినట్లు తెలుస్తోంది.ప్రతివారం లక్కీ డ్రా ఉంటుందని,అందులో బైక్,స్కూటీ,ఫ్రిజ్,మొదలైన పెద్ద వస్తువులు ఉన్నాయని నమ్మబలికి, నా చేత రూ.25 వేలు కట్టించుకున్నారు.ఈ వారం నీకు కలవలేదని వచ్చేవారం డ్రాలో నీ పేరు వస్తుందని చెప్పారు.

ఇక కనిపించకుండా పోయారు.ఫోన్ చేస్తే స్పందించడం లేదని కట్టిన డబ్బులు తిరిగివ్వాలి బాధితుడు వెంకన్న అంటున్నారు.

ఈజీ ఇన్స్టాల్మెంట్ లో ప్రతివారం డబ్బులు కట్టించుకొని మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని,వారి ఫిర్యాదు మేరకు తక్షణమే చర్యలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని తక్షణమే చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేస్తా అనంతగిరి ఎస్ఐ అనిల్ రెడ్డి ( SI ANIL REDDY ) అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube