సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు.పట్టణానికి చెందిన తమ్మర నాగేశ్వరరావు,సుజాత ఇంట్లో దొంగలు పడి 10 లక్షలు నగదు 50 తులాలు బంగారం.
అపహరించుకొని పోయినారని బాధితులు చెపుతున్నారు.సుమారు 10 గంటల సమయంలో పూజ కోసమని పక్కింటికి వెళ్ళామని తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని ఇంట్లో ఉన్న 10 లక్షల నగదు 50 తులాల బంగారం పోయిందాని తమ కొడుకుని జర్మనీ పంపించేందుకు డబ్బు దాచుకున్నామని వాపోయారు.
బాధితుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.