సూర్యాపేట జిల్లా:రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటును తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మంగళవారం రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కోదాడ పట్టణంలో యువకులతో కలిసి నల్ల చొక్కా ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ వద్ద మౌన దీక్షను చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమించిందని,రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం బలిదానాలు చేసిందని,తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
దేశ సంపదను ఆదానీలకు,అంబానీలకు దోచి పెడుతుంటే ప్రశ్నించిన రాహుల్ గాంధీపై వేటు వేయడం దేనికి సంకేతమన్నారు.
ప్రశ్నిస్తే వేటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమేనన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ళను వదిలేసి ప్రశ్నించే వారిని,ప్రజా సమస్యలపై పోరాడే వారిపై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు.రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పదిందని,బహిష్కరణ ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రేవంతన్న సైన్యం కోదాడ నియోజకవర్గ నాయకులు జలంధర్ భగత్,రాము, పాషా,పిచ్చయ్య,బాలాజీ నాయక్,నాగరాజు,కిరణ్, రామకోటయ్య,హరిలాల్, హస్సన్,మహేష్, రాంబాబు,ప్రేమ్,సాయి, శంకర్ తదతరులు పాల్గొన్నారు.