రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,మరొకరి పరిస్థితి విషమం

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం మాధవరం వద్ద 65వ జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొన్న ప్రమాదంలో పెనుకొండ వీరయ్య(37) అక్కడికక్కడే మృతి చెందగా,తమ్మిశెట్టి గురవయ్య(40)కు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన గురవయ్యను హుటాహుటిన సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

 One Died In A Road Accident And The Other Is In Critical Condition-TeluguStop.com

వీరిద్దరిది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంగా గుర్తించారు.సూర్యాపేట రూరల్ మండలం కందగట్ల గ్రామంలోని ఇటుక బట్టీలలో కూలీలుగా పనిచేస్తున్న వీరు ఒకే ఊరుకు చెందిన వారు కావడంతో గురువారం స్వగ్రామలో ఫంక్షన్ కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube