సూర్యాపేట జిల్లా
: కేంద్రంలో బీజేపీ( BJP ) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 4న కొత్తగూడెం ( Kothagudem )జిల్లా కేంద్రంలో సిపిఐ ( CPI )ఆధ్వర్యంలో భారీ ఎత్తున లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మ భిక్షం( Dharma Bhiksham ) భవనం నందు ఛలో కొత్తగూడెం బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రిక సిపిఐ నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల,పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ దేశ సంపదను కొల్లగొడుతుందని విమర్శించారు.రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సామాన్యులపై అధిక ధరల భారం మోపి సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు.
వెంటనే నిత్యవసర వస్తువుల ధరలను,పెట్రోల్ పై 50 రూపాయలు,డీజిల్ పై 40 రూపాయలు,గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయలు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలనిడిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేసి, నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ దొరెపెల్లి శంకర్, మైనార్టీ నాయకులు పాషా,బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్,హరి,తాళ్ల సైదులు,వాడపల్లి గోపి, దిండుగల సురేష్ తదితరులు పాల్గొన్నారు.