65 మంది కానిస్టేబుల్స్ ఉద్యోగోన్నతి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మరోసారి 65 మంది పోలీసు కానిస్టేబుళ్ళకు ఉద్యోగోన్నతులు లభించాయి.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు దక్కిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు ఎస్పీ రితిరాజ్ తో కలసి ఉత్తర్వుల పత్రాలు అందించి,హెడ్ కానిస్టేబుల్ బ్యాడ్జి ధరింపజేశారు.

 65 Constables Promoted-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు.జిల్లాలో మరోసారి పదోన్నతులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి,డీజీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగోన్నతులు పొందిన పోలీసు సిబ్బంది గర్వంగా విధులు నిర్వర్తించాలని కోరారు.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కానిస్టేబుల్స్ కు కోర్టు సానుకూలంగా స్పందించడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ లభిస్తున్నాయని చెప్పారు.

జిల్లాలో మరోసారి 65 మందికి హెడ్ కానిస్టేబుల్స్ కి ప్రమోషన్ లభించాయని,ఈ భారీ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి,డీజీపీకి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపినారు.కొద్దిరోజుల క్రితమే జిల్లాలో 65 మంది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో 65 మంది పోలీసు సిబ్బందికి ఉద్యోగోన్నతులు లభించడంతో జిల్లా పోలీసు సిబ్బందితో ఆనందం వెల్లివిరిసిందని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.ఉద్యోగోన్నతి పాటుగా బాధ్యతలు పెరుగుతాయని,గర్వంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.

సిబ్బంది కొత్త ఉత్సాహంతో పని చేయాలని అన్నారు,సుదీర్ఘకాలం పని చేసి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందడం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు.బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, బాధ్యతలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలి అన్నారు.

అందరూ ఉత్తమ సేవలు అందిస్తే పోలీసు శాఖకు మంచి పేరువస్తుందని అన్నారు.పని చేసే వద్ద అందరితో కలివిడిగా ఉండి అందరినీ సమన్వయం చేసుకుంటూ టీమ్ వర్క్ చేయాలని,మంచి సక్సెస్ కోసం కృషి చేయాలని కోరారు.

తోటి వారికి ఆదర్శంగా ఉండాలి అన్నారు.సాంకేతికత వైపు వెళుతున్న సమాజంలో మీరు వయస్సుతో పనిలేకుండా సాంకేతిక నైపుణ్యం సాధించాలని కోరారు.

ఈ స్థాయికి చేరడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంటుందని, కుటుంబాలతో సంతోషంగా గడపాలని సూచించారు.అదనపు ఎస్పీ రితిరాజ్ మాట్లాడుతూ చిరునవ్వు కలిగి ఉండి కుటుంబ సభ్యులతో అందంగా గడపాలన్నారు.

వత్తిడి లేకుండా పని చేయాలని ఒక టీమ్ గా ఉండాలని,కలిసికట్టుగా పని చేయాలని చెప్పరు.ఈ అవకాశం కల్పించిన ఎస్పీకి పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ బి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,సూపరింటెండెంట్ శ్రీకాంత్,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube