పేద‌ల‌కు అండ‌గా సిఎం కేసిఆర్‌

సూర్యాపేట జిల్లా:ఏ సర్కారు పేదింటి ఆడబిడ్డలను ఆదుకోలేదని,కేసీఆర్ ప్రతి పథకం వెనుక మానవీయకోణం ఉంటుందని,తెలంగాణ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయని,అభాగ్యులకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయనిధి చరిత్రలో నిలిచిపోతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం మోతె మండలానికి చెందిన 160 మంది కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ మరియు సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు ఒక కోటి 60 లక్షల 18వేల 560 రూపాయ‌ల విలువైన చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్నాయ‌ని,పుట్టుక నుంచి పెళ్లి వ‌ర‌కు అండ‌గా నిలుస్తున్న మ‌హా నాయ‌కుడు మ‌న ముఖ్య‌మంత్రి కేసిఆర్ అని కొనియాడారు.

 Cm Kcr On Behalf Of The Poor-TeluguStop.com

పేద ఆడ‌బిడ్డ‌ల పెళ్లికి క‌ళ్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం ద్వారా 1 ల‌క్షా 116 రూపాయ‌లు అంద‌జేసి,మేన‌మామ‌గా వారి గుండెల్లో నిలిచార‌ని అన్నారు.పుట్టగానే కేసిఆర్ కిట్ అందించి, పెళ్లి స‌మ‌యంలో క‌ళ్యాణ‌ల‌క్ష్మి చెక్కును అంద‌జేసిన సీఎం కేసిఆర్ ను గుండెల్లో పెట్టుకుంటారన్నారు.

గతంలో ఏ సర్కార్ పేదింటి ఆడబిడ్డలను ఆదుకోలేదని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి పథకం వెనుక మానవీయ కోణం ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందే విధంగా కృషి చేస్తున్నామ‌ని అన్నారు.

ఆసరా పెన్షన్లతో వృద్దులకు అండగా నిలిచి, గౌరవాన్ని పెంపొందించిన మహానీయుడు మన సియం కేసీఆర్ అని అన్నారు.కేసీఆర్ అండతో కోదాడ నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందని,ఇంకా అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లక్షల 32 వేల రూపాయలను మండలానికి చెందిన పదిమంది అనారోగ్యానికి గురైన బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

ఆపత్కాలంలో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందన్నారు.మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని తెలిపారు.

వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎనో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుందని,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగపర్చుకోవాలని సూచించారు.రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అభివృద్ధిలో,సంక్షేమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని,ప్రతి నెల ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని,అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆశ శ్రీకాంత్ రెడ్డి,జడ్పిటిసి పుల్లారావు,మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, పిఎసిఎస్ చైర్మన్ కొండపల్లి వెంకట్ రెడ్డి,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నరసింహారావు,ఎంపీటీసీలు ఫోరం అధ్యక్షులు వెంకన్న,ఎమ్మార్వో యాదగిరి,ఎంపీడీవో శంకర్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు,టిఆర్ఎస్ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube