నల్లగొండ జిల్లా:అకాల వర్షనికి ఐకెపి సెంటర్లలో తడిసి,రంగు మరిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చెస్తుందని నకిరేకల్ తహశీల్దార్ గుగులోతు ప్రసాద్ నాయక్ ( Gugulothu Prasad Naik ) తెలిపారు.శుక్రవారం నకిరేకల్ లోని లక్ష్మీ సరస్వతి రైస్ మిల్( Lakshmi Saraswati Rice Mill ) లో డిసిఎస్ఓ,డిటిసిఎస్ లతో కలిసి ఆయన సందర్శించి తనిఖీ చేశారు.
అనంతరం మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ధాన్యం దిగుమతులపై చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లులో ధాన్యం వేగవంతంగా దిగుమతి చేయాలని,తడిసి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని,రైతులు ఎలాంటి కంగారు పడొద్దని అన్నారు.
మండలంలో నాణ్యత గల ధాన్యం అందుబాటులో ఉందని, రైస్ మిల్లు యాజమానులు ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా రంగు మరిన ధాన్యాన్ని దింపుకునేందుకు అంగీకరించాలన్నారు.లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.