హిందూ మహాసభను రద్దుచేయాలి

సూర్యాపేట జిల్లా:కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.అనంతరం బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహాత్మ గాంధిని అవమాన పరుస్తూ మహిశాసురుని స్థానంలో గాంధీ మహాత్ముని ఫోటో పెట్టడాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం హిందూ మహాసభ దిష్టిబొమ్మను దహనం చేశారు.

 Hindu Mahasabha Should Be Dissolved-TeluguStop.com

ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరణ సత్యనారాయణ,జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండ రాజా మాట్లాడుతూ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహం వద్ద మహిశాసురిని స్ధానంలో గాంధీ మహాత్ముని చిత్రపటం పెట్టి అవమానించిన హిందూ మహాసభను రద్దుచేయాలని,గాంధీని అవమానించిన హిందుత్వ అతివాద శక్తులపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు.దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్ర సమపార్జనలో ముఖ్యులైన మహాత్మా గాంధీని అవమాన పర్చడం సిగ్గుచేటని అన్నారు.

ఈ సంఘటనకు పాల్పడిన దుండగులను శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షులు గోండ్రాల అశోక్,44 వ వార్డు కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్,కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్,ఆర్యవైశ్య సంఘం జిల్లానాయకులు తోట శ్యామ్ ప్రసాద్,రాచకొండ శ్రీనివాస్,దేవరశెట్టి సత్యనారాయణ,మీలా వంశీ,కలకోట లక్ష్మయ్య, బిక్కుమళ్ల క్ర్రష్ణ,రేపాల పాండు,కర్నాటి వంశి, కలకోట అనిత,తోట కమల పెద్దసంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube