లోపభూయిష్టంగా నేషనల్ హైవే నిర్మాణం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పురపాలిక పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న నేషనల్ హైవే నిర్మాణం అంతా లోపభూయిష్టంగా ఉందని సిపిఎం,టీడీపీ పార్టీల నాయకులు పారేపల్లి శేఖరరావు,పాల్వాయి రమేష్ ఆరోపించారు.నేరేడుచర్ల మండల కేంద్రంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా రహదారి నిర్మాణం చేస్తూ, ఇష్టానుసారంగా ఒక్కో చోట ఒక్కో కొలతలు పెడుతూ,నాణ్యత లేని పనులు చేస్తున్నారని, అంతేకాకుండా పంట కాలువలను కూడా పూడ్చి వేస్తున్నారని ఆరోపించారు.

 Defective Construction Of National Highway-TeluguStop.com

పట్టణంలో రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక దగ్గర 73/74/ 69/72 కొలతల వ్యత్యాసాలతో రోడ్డు నిర్మాణం చేపట్టడం వలన భవిష్యత్తులో పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా రోడ్డు నిర్మాణంలో కూడా నాణ్యత లోపించిందని మరియు హైవేకు రెండు పక్కల,రెండు డ్రైనుల మధ్య ఉండవలసిన కొలతల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు.

పనులు ఈ విధంగా చేయడం వలన కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున డబ్బు మిగిలించుకునే పరిస్థితి ఉందని, ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు.హైవే అధారిటీ వారు నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని రకాల కొలతలతో ఎందుకు కోసం,ఎవరి మేలు కోసం చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రధానంగా సిపిఎం పార్టీ కార్యాలయంకు వెళ్లే రోడ్డులోని 3 ఎల్.డి.పి పంట కాలువను ఎందుకు డ్రైనుగా మామారుస్తున్నారని, పంట కాలువను ఆర్ అండ్ బీ వారు ఎందుకు పూడ్చి చేశారని నిలదీశారు.ఇప్పటికైనా అధికారులు జరిగే పనుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకుని, వాస్తవమైన కొలతలతో రోడ్డు ఏర్పాటు చేస్తూ, పంటకాలువను పునరుద్దించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్,మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి,సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్, టీడీపీ నాయకులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube