సూర్యాపేట జిల్లా:జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న నిందితులను గురువారం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 30 టన్నుల పిడిఎస్ రేషన్ బియ్యం సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు( Police ) పట్టుకున్నట్లుతెలిపారు.
నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా ఒకరు పరారిలో ఉన్నట్లు చెప్పారు.నిందితుల వద్ద నుండి ఒక లారీ,మూడు అశోక్ లేలాండ్ వాహనాలు స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు.