తెలిసో తెలియకో కొన్నిటిని పచ్చిగా తినేస్తుంటాం మనం.పచ్చిగా ఏది తిన్నా చేటు జరుగుతుందని చెప్పలేం కాని, కొన్నిటిని పచ్చిగా తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి.
కాబట్టి పచ్చిగా ఏవేవి తినకూడదో తెలుసుకోండి.
* పాలు పచ్చిగా తాగడం అంత మంచిది కాదు.
ఎందుకంటే పచ్చిపాలలో లిస్టేరియా, బ్రూసెల్లా ఉంటాయి.వీటి వలన వాంతులు, తలనొప్పి, కడుపులో నొప్పి లాంటి ఇబ్బందులు రావొచ్చు.
* పచ్చి మాంసం అస్సలు ముట్టకపోతేనే మంచిది.పచ్చి మాంసంలో సల్మోనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది.
దీని వలన జ్వరం, తలనొప్పి, డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.కాబట్టి మాంసం మనకు ఇష్టమైన పద్ధతుల్లో వండుకోని మాత్రమే తినాలి.
* పచ్చి కోడిగుడ్డులో కూడా సల్మోనెల్లా ఉంటింది.ఇది కూడా పచ్చి మాంసం మోసుకొచ్చె ఇంఫెక్షన్స్ ని మోసుకురాగలదు.
ఉడకబెట్టిన గుడ్డే ఆరోగ్యం.
* బాదాంని నీళ్ళలో నానాబెట్టిన తరువాత తినాలి.
లేదంటే సియనైడ్ అలాగే ఉండిపోతుంది.దాని వలన కడుపులో మంటతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరగొచ్చు.
* మష్రూమ్స్ పెరిగే వాతావరణమే వేరు.దీనిలో కార్సినోజెనిక్ ఉంటుంది.
పచ్చిగా తింటే హైటాక్సిక్ లెవెల్స్ పెరుగుతాయి.కాబట్టి ఉడికించి తినాలి.
* గ్రీన్ వెజిటబుల్స్ కూడా పచ్చిగా తినకూడదు.ఉడకబెట్టాకే తినాలి.
లేదంటే ఆక్సిలిక్ ఆసిడ్ మన బాడిలోకి కాల్షియం, ఐరన్ ని రానివ్వదు.
* ఇవి మాత్రమే కాదు, టమోటాలు, మొలకలు, జీడిపప్పు, ఇంకా ఎన్నోరకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు.