కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం,ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని 65వ జాతీయ రహదారిపై మేళ్లచెర్వు బై పాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని విజయవాడ నుండి హైదరాబాద్ కు పోతున్న కారు నెనుక నుండి అతివేగంగా ఢీ కొనడంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి బైక్ తో సహా బైక్ పై వెళుతున్న భార్యాభర్త,ముగ్గురు పిల్లలు కిందకు పడి పోవడంతో భార్యాభర్తలు,ఒక పాప అక్కడిక్కడే మృతి చెందగా,ఇద్దరి చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

 Three Killed In Road Mishap In Kodada-TeluguStop.com

మృతులు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన భార్యభర్తలు బోయల శ్రీనివాస్(32)నాగమణి(28), వారి ముగ్గురు అడపిల్లలుగా గుర్తించారు.స్వగ్రామం నుండి చిలుకూరు మండలం సీతారామపురం అత్తగారు ఇంటికి పోతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరు చిన్నారులను హుటాహుటిన మెరుగైన వైద్య కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన ఇద్దరి చిన్నారుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్వగ్రామం నల్లబండగూడెంతో పాటు అత్తగారి గ్రామం సీతారమపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులను, బంధువులను పరామర్శించారు.గాయపడిన చిన్నారుల గురించి వాకబు చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube