కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలి:మున్సిపల్ చైర్ పర్సన్

సూర్యాపేట పట్టణంలో కౌన్సిలర్లు,ప్రజల సహకారంతో వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు.గురువారం సూర్యాపేట పట్టణం 17 వ వార్డు చింతలచెరువులోని ప్రాధమిక పాఠశాల నందు ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ తో కలిసి ఆమె ప్రారంభించారు.

 Kanti Velugu Program In Suryapet Hospitals,suryapet ,suryapet Government Hospita-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంటి వద్దకే వైద్యం అందించాలనే సంకల్పంతో సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పేద ప్రజలు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునే స్తోమత లేనివారి కోసం వారి వార్డులోనే ఉచితంగా కంటి పరిక్షల నిర్వహణతో పాటు కళ్లజోళ్లు అందజేసే కార్యక్రమం కంటివెలుగును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సారధ్యంలో మెడికల్ కాలేజ్,నర్సింగ్ కాలేజ్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ జరుగుతుందని, సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకుందన్నారు.17 వ వార్డులో ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందజేస్తున్న యువ కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ కు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ మాట్లాడుతూ వార్డులో జిజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.గత సంవత్సరం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు లయన్స్ ఐ హాస్పిటల్ ద్వారా 39 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు.

గతంలో ఏ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఇంతలా పనిచేయలేదని,సిఎం కేసీఆర్ మన బిడ్డ కాబట్టే ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని, మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఆరోగ్య జిల్లాగా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మౌనిక, ఆప్ట్రోమిస్టు రాజేశ్వరి, డిఇఓ సురేందర్,సూపర్ వైజర్ రవి,ఎఎన్ఎమ్ ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube