ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచిన పేద విద్యార్థి

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ పాఠశాల( Government school )లో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన ఇమ్మడి ఉప్పలయ్య,విజయకుమారి దంపతుల ద్వితీయ కుమారుడు ఇమ్మడి ప్రవీణ్( Immadi Praveen ).పేద కుటుంబానికి చెందిన ప్రవీణ్ పదవ తరగతి వరకు పోలుమల్ల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ రాజపేట గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు.

 He Was An Exemplary Poor Student Who Passed Mbbs-TeluguStop.com

నీట్ పరీక్ష రాసి మొదటిసారి విఫలమైనా నిరాశ చెందకుండా,రెండవసారి ప్రయత్నించి ఎంబీబీఎస్ సీట్( MBBS seat ) ను సాధించాడు.

మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల( Mahabubnagar Medical College )లో గురువారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రుల కల నెరవేర్చాడు.

ఈ సందర్బంగా తండ్రి ఉప్పాలయ్య మాట్లడుతూ ఈ రోజు నా కుమారుడు ఈ స్థితికి రావడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ కు,భారత రాజ్యాంగానికి,చదువు నేర్పిన గురువులకు, వెన్నుతట్టి ప్రోత్సహించిన బంధువులకు,మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రవీణ్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించిన విషయం తెలుసుకొని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube