నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి చెందిన వల్వాయి అంజయ్య,సుజాత దంపతుల కుమార్తె సాయి అభిజ్ఞ తెలంగాణ స్టేట్ తరుపున బాలికల 33 సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు జాతీయ జట్టుకి ఎంపికైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర,జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ యాదవ్, కర్తయ్య ప్రకటించారు.ఇటీవల తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో
సూర్యాపేట జిల్లా మల్లారెడ్డి గూడెంలో జరిగిన అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్ షిప్- 2024 లో కనబరచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.
నల్గొండ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సాయి అభిజ్ఞ మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగే జాతీయ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.కబడ్డీలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.