మైనర్ల వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవు:ట్రాఫిక్ సిఐ డానియల్

నల్లగొండ జిల్లా:వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 21మంది మైనర్లకు వారి తల్లదండ్రుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నందు గురువారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ సీఐ డానియల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు తెలిసితెలియని వయస్సులో వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారకులు అవుతున్నారని పేర్కొన్నారు.

 No Action Will Be Taken If Minors Are Caught Driving Vehicles Traffic Ci Daniel-TeluguStop.com

కావున ప్రతి తల్లితండ్రులు 18 సంవత్సరాల లోపు పిల్లలకు,లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని అన్నారు.ఎవరైనా మైనర్లు వాహనాలు ఇస్తే తల్లితండ్రుల పైన కేసులు నమోదు చేయపడుతాయని హెచ్చరించారు.

అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు,ప్రమాదాలకు గురి కాకుండా పాటించాల్సిన నియమాలు,ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన, విద్యార్థులకు రోడ్డు సంకేతాలు,లేన్ క్రమశిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత,ర్యాష్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,ట్రిపుల్ డ్రైవింగ్ మరియు డ్రైవింగ్ నైపుణ్యాల గురించి వివరించడం జరిగిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube