మైనర్ల వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవు:ట్రాఫిక్ సిఐ డానియల్

మైనర్ల వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవు:ట్రాఫిక్ సిఐ డానియల్

నల్లగొండ జిల్లా:వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 21మంది మైనర్లకు వారి తల్లదండ్రుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నందు గురువారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ సీఐ డానియల్ తెలిపారు.

మైనర్ల వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవు:ట్రాఫిక్ సిఐ డానియల్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు తెలిసితెలియని వయస్సులో వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారకులు అవుతున్నారని పేర్కొన్నారు.

మైనర్ల వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవు:ట్రాఫిక్ సిఐ డానియల్

కావున ప్రతి తల్లితండ్రులు 18 సంవత్సరాల లోపు పిల్లలకు,లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని అన్నారు.

ఎవరైనా మైనర్లు వాహనాలు ఇస్తే తల్లితండ్రుల పైన కేసులు నమోదు చేయపడుతాయని హెచ్చరించారు.

అనంతరం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు,ప్రమాదాలకు గురి కాకుండా పాటించాల్సిన నియమాలు,ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన, విద్యార్థులకు రోడ్డు సంకేతాలు,లేన్ క్రమశిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత,ర్యాష్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్,ట్రిపుల్ డ్రైవింగ్ మరియు డ్రైవింగ్ నైపుణ్యాల గురించి వివరించడం జరిగిందన్నారు.

శుభం మూవీ ట్రైలర్ రివ్యూ.. సమంత నిర్మించిన తొలి సినిమా ట్రైలర్ వేరే లెవెల్!

శుభం మూవీ ట్రైలర్ రివ్యూ.. సమంత నిర్మించిన తొలి సినిమా ట్రైలర్ వేరే లెవెల్!