ఐకేపీ వివోఏల ధర్నాతో దద్దరిల్లిన నల్లగొండ కలెక్టరేట్!

నల్లగొండ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం నల్గగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఐకేపీ వివోఏలు ధర్నాకు దిగి నినాదాలతో హోరెత్తించారు.వివోఏల ధర్నాకు సిఐటియు మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా సిఐటియు నేత తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని,కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని,10 లక్షల సాధారణ భీమా ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.

 Ikp Voa Dharna Nalgonda Collectorate, Ikp Voa Dharna ,nalgonda Collectorate, Nal-TeluguStop.com

అర్హులైన వివోఏలుగా పదోన్నతులు కల్పించి,డిమాండ్ల పరిష్కారానికి వెంటలే చర్యలు చేపట్టాలన్నారు.వివోఏల వేతనాలను నేరుగా ఖాతాల్లో జమ చేయాలని,సంఘాలకు అభయహస్తం బకాయిలు చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దండంపల్లి సత్తయ్య,లక్ష్మీనారాయణ, ఐకెపి వివోఏల సంఘం నాయకులు,జిల్లా పరిధిలోని వివిధ మండలాల వివోఏలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube