నల్లగొండ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం నల్గగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఐకేపీ వివోఏలు ధర్నాకు దిగి నినాదాలతో హోరెత్తించారు.
వివోఏల ధర్నాకు సిఐటియు మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా సిఐటియు నేత తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని,కనీస వేతనం రూ.
26,000 చెల్లించాలని,10 లక్షల సాధారణ భీమా ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వివోఏలుగా పదోన్నతులు కల్పించి,డిమాండ్ల పరిష్కారానికి వెంటలే చర్యలు చేపట్టాలన్నారు.వివోఏల వేతనాలను నేరుగా ఖాతాల్లో జమ చేయాలని,సంఘాలకు అభయహస్తం బకాయిలు చెల్లించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దండంపల్లి సత్తయ్య,లక్ష్మీనారాయణ, ఐకెపి వివోఏల సంఘం నాయకులు,జిల్లా పరిధిలోని వివిధ మండలాల వివోఏలు పాల్గొన్నారు.
రోడ్డుపై ఆవు అరాచకం.. తల్లి, బిడ్డపై దాడి.. షాకింగ్ వీడియో వైరల్!