ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు ఈడీ క్షమాపణ చెప్పింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనుకోకుండా ఎంపీ సంజయ్ సింగ్ పేరును ప్రస్తావించినట్లు తెలిపింది.
సంజయ్ సింగ్ ఇచ్చిన లీగల్ నోటీసుకు ఈడీ వివరణ ఇచ్చింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ అంశంలో ఈడీ తన పేరును ఛార్జ్ షీట్ లో పేర్కొనడంపై సంజయ్ సింగ్ ఈడీకి లీగల్ నోటీసులు పంపారు.
ఛార్జ్ షీట్ లో తన పేరును ఇరికించి తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని నోటీసుల్లో పేర్కొన్నారు.దీనిపై స్పందించిన ఈడీ అనుకోకుండా పొరపాటు జరిగిందని తెలిపింది.
రాహుల్ సింగ్ కు బదులుగా సంజయ్ సింగ్ అని ప్రస్తావించినట్లు ఈడీ అంగీకరించింది.







