ప్రముఖ బ్రాహ్మణ క్రైస్తవ ఇవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ( Brother Anil Kumar )గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు.తనదైన వాగ్ధాటితో అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ గా పేరు గడించాడు.
అనిల్ కుమార్ ఓసీ కాపు విశ్వాసి అయినటువంటి కేఏ పాల్ మార్గంలో ఎన్నికల రాజకీయాల్లోకి దిగిపోకుండా, మియాపూర్ కల్వరీ టెంపుల్ అధిపతి డా.పి.సతీష్ కుమార్ ( Dr.P.Satish Kumar )దారిలో దేవుని వాక్యం చెప్పుకుంటూ బతికితేనే క్షేమకరం అని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విషయం ఏమిటంటే, కేఏ పాల్ మార్గంలో ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి మరో ప్రొటెస్టెంట్ ఇవాంజలిస్ట్ బ్రదర్ మొరుసుపల్లి అనిల్ కుమార్ కూడా వస్తున్నారనే ప్రచారం ఇపుడు ముమ్మరంగా సాగుతోంది.
ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ పేరిట కేఏ పాల్( KA Paul ) కిందటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన సంగతి విదితమే.అప్పట్లో తెలుగుదేశంతో కుమ్మక్కయి 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిందనే ఆరోపణలు రావడం అందరికీ తెలిసినదే.ఇకపోతే బ్రదర్ అనిల్ హైదరాబాదీ అని చెప్పుకుంటున్నా ఆయన ఆంధ్రా మనిషిగానే బీఆరెస్ నేతలు పరిగణిస్తుండడం కొసమెరుపు.ఆయన భార్య వైఎస్ షర్మిలను( YS Sharmila ) సైతం అక్కడి జనాలు రాయలసీమ నాయకురాలిగానే చేస్తున్నారు.
మరో పక్క దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ( YS Rajasekhara Reddy )సన్నిహిత మిత్రుడు, సలహాదారు కోటగిరి వెంకట భాస్కర రామచంద్రరావు ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే తెర వెనుక పాత్ర పోషిస్తున్న కారణంగా ఈ కృష్ణా జిల్లాలో మూలాలున్న పద్మనాయక వెలమ నాయకుడిని కూడా ఆంధ్రా నేతగానే చూస్తూ బీఆరెస్ మంత్రి గంగుల కమలాకర్ మొన్న విరుచుకు పడిన సంగతి అందరూ ప్రత్యక్షంగా చూశారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డిపై కొడంగల్ లో బ్రదర్ అనిల్ కుమార్ తన భార్య పార్టీ తరఫున పోటీచేస్తే మాత్రం ఇబ్బందులు పడినట్టే అని పలువురు చెబుతున్నారు.బ్రదర్ అనిల్ కుమార్ ఎంత ‘గుడ్ లుకింగ్, డైనమిక్, డాన్సింగ్’ ఇవాంజలిస్ట్ అయినప్పటికీ ‘ఇంటర్నేషనల్ క్రైస్తవ లాబీయిస్టు’గా చెప్పుకునే కాపు క్రైస్తవుడు కేఏ పాల్ మార్గంలో పయనిస్తే మాత్రం అభాసుపాలు కాక తప్పదని తెలంగాణ రాజకీయ ఉద్ధండులు చెబుతున్నారు.అందుకే బ్రదర్ అనిల్ కుమార్ ఇకపై ‘వాక్యం’ చెబుతూ క్రైస్తవేతరులను ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలని హైదరాబాద్, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రముఖులు ఫీల్ అవుతున్నారు!
.