ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి:సుభాషన్న

నల్లగొండ జిల్లా:విద్యాశాఖలో నియామకాలకు నోచుకోని ఉపాధ్యాయ,అధ్యాపక పోస్టులపై,నోటిఫికేషన్లకు నిరుద్యోగుల ఎదురుచూపులపై,పాఠశాలలు,కళాశాలల్లో బోధన సిబ్బంది కొరతను ఇంకెప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తూ నిరుద్యోగ, ఉద్యోగుల పరిస్థితిపై ఆవేదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిపిఐ (ఎంఎల్) సెక్రటరీ బోరన్నగారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదని ఆరోపించారు.

 Posts Lying Vacant For Years Should Be Filled Immediately: Subhasanna-TeluguStop.com

ప్రత్యక్ష నియామకాల ద్వారా దాదాపు 12 వేల ఖాళీలను నింపాల్సి ఉందని,పదోన్నతులతో మరో 10 వేల పోస్టులు భర్తీ చేయాలని.కాంట్రాక్టు ఆధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు 8 నెలలైనా మోక్షం లేదని లేఖలో పేర్కొన్నారు.

దీంతో నాణ్యమైన విద్య అందక పేద విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.మరోవైపు నియామక ప్రకటనలు ఎప్పుడొస్తాయోనని లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని,ఆర్థికశాఖ అనుమతించినా,ఆచరణకు నోచుకోలేదని అవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ జూనియర్,డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 2,440 బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి ఆర్ధికశాఖ జులై 22న అనుమతి ఇచ్చిందని,కానీ ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదని వేలెత్తి చూపారు.ఎన్టీ రిజర్వేషన్ ను అమలుచేస్తూ జీఓ ఇవ్వడం వల్ల రోస్టర్ పాయింట్ల విధానం మారుతుందని,ఈ విషయాన్ని వెంటనే కొలిక్కి తేవాలని కోరారు.

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బడుల్లో దాదాపు 9 వేల ఖాళీలను నింపాల్సి ఉందని,గతంలో ఉన్న 12 వేల మంది విద్యావాలంటీర్లను తొలగించడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని,చివరకు క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు (సీఆర్సిలు) కూడా బోధించాలని ఇటీవలే ఆదేశించడం గమనార్హమని,విద్యార్డి,యువజన,నిరుద్యోగ సంఘాల జేఏసీ గౌరవ నేతగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన ‘టెట్’ ఫలితాలు వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎన్ని ఖాళీలు భర్తీచేయాలో నిర్ణయిస్తూ ఆర్థికశాఖ నుంచి జీఓ రాలేదని,ఇక పదోన్నతులు ఇస్తే మరో 10 వేల మందికి ప్రయోజనం దక్కుతుందని,అంటే ఆ మేరకు పోస్టులు భర్తీ అవుతాయని,టెట్ పూర్తయిన వెంటనే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) జరుపుతామని పలుమార్లు ప్రకటించినా నేటి వరకు ఏలాంటి నోటిఫికేషన్ రాలేదన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం బోధన సిబ్బంది పోస్టులు 4,007, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు 1,200 మంది మాత్రమే ఉన్నారని,కాంట్రాక్టు విధానంలో 860,అతిథి అధ్యాపకులు మరో 850 మంది ఉన్నారన్నారు.జూనియర్ కళాశాలల్లో మొత్తం 6,008 పోస్టులుండగా రెగ్యులర్ అధ్యాపకులు 900 లోపే ఉన్నారని,కాంట్రాక్టు అధ్యాపకులు 3,500 మంది వరకు ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలోని మోడల్ పాఠశాలల్లో 2013 తర్వాత నియామకాలు జరగలేదని,వాటిలో 707 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా,మరో 300కి పైగా పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉందన్నారు.విశ్వవిద్యాలయాలలో నెలకొని ఉన్న ఖాళీపోస్ట్ లను ఎప్పుడు భర్తీ చేస్తారని సీఎంకు రాసిన లేఖలో ప్రశ్నించారు.

రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆచార్యుల ఖాళీలను కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గత ఏప్రిల్లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించిందని,దాని ఏర్పాటుపై జూన్ లో జీఓ ఇచ్చిందని,కానీ,అది నేటికీ అమల్లోకి రాలేదని ఆరోపించారు.రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో దాదాపు 2,500 వరకు బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమంటూ పాలకవర్గాలు గొప్పలు చెబుతున్నవే తప్ప అది ఎప్పుడు నెరవేరుతుందో చెప్పడం లేదన్నారు.

పాఠశాలల్లో విద్యా సామర్థ్యాలు పెరగాలని పట్టుబడుతున్న విద్యాశాఖ,ఉపాధ్యాయుల ఖాళీలను నింపడంలో మాత్రం జాప్యం చేస్తోందని,132 డిగ్రీ కళాశాలల్లో 85 చోట్ల శాశ్వత ప్రిన్సిపాళ్లే లేరని,ఫలితంగా పర్యవేక్షణ కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.కళాశాల,ఇంటర్,సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని 5 వేలకు పైగా కాంట్రాక్టు అధ్యాపకుల కొలువులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించినా నేటికీ కార్యరూపం దాల్చలేదని ప్రజానేస్తం బోరాన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిరుద్యోగ సమస్యపై రాసిన బహిరంగ లేఖలో ఘాటుగా విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube