రేపు జరగబోయే విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి

నల్లగొండ జిల్లా:ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్( AISF ) ఆధ్వర్యంలో 12 న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు.కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం మనఊరు-మనబడి( Mana Ooru Mana Badi ) పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపచేయాలనే డిమాండ్ తో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే విద్యాసంస్థల బంద్ పోస్టర్ ను విడుదల చేశారు.

 Sf Bandh Tomorrow In Telanagana , Public Educational Institutions , Aisf , Mana-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీవీబీ పాఠశాలను నూతన బిల్డింగ్ ని తక్షణమే నిర్మించాలన్నారు.పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్,ఫీజు నెంబర్స్మెంటు తక్షణమే విడుదల చేయాలన్నారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని ధ్వజమెత్తారు.

విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా నేటికీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు,యూనిఫామ్ తదితర మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని ఆరోపించారు.

ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని అధికార యంత్రాంగం ప్రకటనలు చేస్తున్నా సూత్రప్రాయంగా మాత్రం విద్యాసంస్థల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

అదే విధంగా జీఓ నెంబర్ 1 నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా తమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తూ, చదువు’కొన’గలిగే వారికి చెందేలా కుట్రలు చేస్తున్నదన్నారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాధికారుల అజమాయిషీ తగ్గిందని, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నా,అనధికార విద్యా సంస్థలను నడిపిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,అధ్యాపక, నాన్ టీచింగ్ పోస్టులను, ఎంఈఓ,డీఈవో పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో( public educational institutions ) నెలకొన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని,జీఓ.నెంబర్ 1 నిబంధనలను పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్లు,బోధనేతర సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వాలని,ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సులను అన్ని విద్యాసంస్థలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ల సాధనకోసం బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు నేనావత్ బాబూలాల్, ఏఐఎస్ఎఫ్ దే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube