నల్లగొండ జిల్లా: పెద్దవూర మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఓ విచిత్ర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు పెద్దవూర మండల కేంద్రానికి చేరుకున్న సమయంలో బస్సులో ఓ ప్రయాణికుడు జేబులో మొబైల్ ఫోన్ తీస్తుండగా టిక్కెట్ బయటకొచ్చి కిటికీలోంచి గాల్లోకి ఎగిరిపోయింది.ఈ విషయాన్ని ప్రయాణికుడు బస్సు డ్రైవర్ కి చెప్పడంతో వెంటనే బస్సును నిలిపివేశాడు.
సదరు ప్రయాణికుడు టిక్కెట్ ను వెతికేందుకు కిందకు దిగాడు.సుమారు 200 మీటర్లు వరకు వెళ్ళి టిక్కెట్ కోసం వెతికాడు.40 నిమిషాల వరకు టిక్కెట్ దొరకకపోవడంతో నడి రోడ్డుపై నిలిచిన బస్సు వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.దీనితో రహదారిపై వెళ్ళే వాహనదారులు,బస్సులో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
చివరికి టిక్కెట్ దొరకడంతో 40 నిమిషాలు ఆలస్యంగా బస్సు ప్రయాణం మొదలైందని అన్నారు.