నల్లగొండ జిల్లా:బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ యువజన,విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగాని జనార్ధన్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగుల నరేష్ గౌడ్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మొగుళ్ళ వినోద్ గౌడ్,యువజన సంఘం ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్,అఖిల్ రావు తదితరులు పాల్గొన్నారు.