నల్లగొండ జిల్లా:ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీలపై మోదీ ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా,గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం ఈడి కేసులతో చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్,తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్,ఎంపీటీసీ ఎల్లయ్య, కౌన్సిలర్లు సమద్,అమెర్,శంకరయ్య,బాబా,గడిగె శ్రీనివాసులు,యాదయ్య,యూత్ అధ్యక్షుడు గాలి నాగరాజు,చర్లపల్లి గౌతమ్,మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest Nalgonda News