నల్లగొండ జిల్లా:బంగారు తెలంగాణలో సరైన ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక నిరుద్యోగులు పిట్టల్లా రాలుతున్న సంఘటనలు కోకొల్లలు కనిపిస్తున్నాయి.అలాంటి దారుణ సంఘటననే ఆదివారం నల్లగొండ జిల్లాలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాకు చెందిన ఏడుకొండలు(27) ఉద్యోగం,ఉపాధి లేదని,తండ్రి లేని కుటుంబానికి తాను భారం కాకుడదని మనస్థాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ బీఈడీ చేసి,నోటిఫికషన్లు లేక గత కొద్ది కాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు.
అతని తండ్రి 12 ఏళ్ల క్రితం చనిపోగా,తమ్ముడు కూడా ఐదేళ్ల క్రితం మరణిండం గమనార్హం.ఉన్న ఒక్క ఆధారమైన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి ఒంటరిగా మిగిలిపోయింది.
దీనితో ఆ తల్లి పుత్రశోకం చూసి స్థానికులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.