కష్టపడే ప్రతి కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు వుంటుంది:శ్రీధర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:బీజేపీ జిల్లా కార్యాలయంలో నల్గొండ అసెంబ్లీ పరిధి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యాతిథిగా జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా బూత్ స్థాయిలో అంచెలంచెలుగా పార్టీ బలపడుతుందన్నారు.

 Every Worker Who Works Hard Has Recognition In Bjp,sridhar Reddy ,bjp,narendra M-TeluguStop.com

గత నెలలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లతో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించడం జరిగిందని, దీనితో బీజేపీ పట్ల ప్రజలలో మంచి స్పందన వస్తుందన్నారు.నియోజక వర్గానికి సంబంధించిన నాయకులు,కార్యకర్తలు బూత్ స్థాయిలో పూర్తి కమిటీలు నియమించుకోవాలని కోరారు.

అలాగే నూతన కమిటీలలో యువతకు, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, వివిధ పథకాలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న కారణంగా బీఆర్ఎస్ పార్టీపై ప్రజలలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వుందన్నారు.

బీజేపీలో కష్టపడే కార్యకర్తకు మంచి గుర్తింపు లభిస్తుందని, అందుకు ఉదాహరణ మొన్న జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లలో బూత్ అధ్యక్షులను వేదిక మీద కూర్చోబెట్టి బూత్ సమావేశాలు నిర్వహించుకోవడం బీజేపీ లోనే వుంటుందన్నారు.ఎప్పుడు ఎలక్షన్ లు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్,కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి,బీజేపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్,మున్సిపల్ ప్లోర్ లీడర్ బండారు ప్రసాద్,నూకల వెంకట్ నారాయణరెడ్డి, కన్మంతరెడ్డీ శ్రీదేవి రెడ్డి, దాసాజు యాదగిరాచారి, బీజేపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్,బీజేపీ నాయకులు కంకణాల నాగిరెడ్డి,బొజ్జ నాగరాజు,పోతేపాక సాంబయ్య,పోతేపాక లింగస్వామి,కంచర్ల భూపాల్ రెడ్డి,పులకరం భిక్షం,గుండా నవీన,బోగరి అనిల్,బాకీ నర్షిమ్మ, మహేష్,కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube