నల్లగొండ జిల్లా:2023-24 విద్యా సంవత్సరానికి గాను నూతన యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు జూన్ లో పాఠశాలలు ప్రారంభం నాటికే విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలనీ సిపిఐ (ఎంఎల్) కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజానేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నేడు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.గత సంవత్సరం జూన్లో యూనిఫాంలు పంపిణీని ప్రారంభిస్తే ఆగస్టు నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందాయని, గత సంవత్సరం జరిగిన తప్పిదం ఈ సంవత్సరం కూడా పునరావృతం కాకూడదని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యను అధిగమించడానికి జూన్ ప్రారంభం నాటికే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పాఠశాలకు వచ్చేలా, విద్యార్ధులకు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.ఇవ్వడం ఎలాగూ తప్పదు కదా! ఆ ఇచ్చేదేదో సకాలంలో ఇస్తే (జూన్ ప్రారంభం నాటికే ఇస్తే) విద్యార్థులు అందరూ ఒకే రోజు అనగా పాఠశాలలు ప్రారంభం రోజున ధరించి వస్తారని,అది ప్రభుత్వ పాఠశాలల విద్యాశాఖకు ఒక కొత్తదనాన్ని, విద్యార్ధులకు,వారి తల్లిదండ్రులకు ఉత్సాహాన్ని ఇస్తుందని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
6,7 తరగతుల బాలురు నెక్కర్లు వేసుకోవడానికి ఇష్టపడడం లేదని,కనుక ఈసారి అలా కాకుండా 6, 7 తరగతుల బాలురకు కూడా ప్యాంట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.యూనిఫాంలు కుట్టడానికి ఇచ్చే బట్ట గత సంవత్సరంలో నాణ్యత లేనిది ఇచ్చారని,ఈ సంవత్సరమైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాణ్యమైన బట్ట ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో గల ప్రభుత్వ పాఠశాలలలో తిష్ట వేసిన రకరకాల సమస్యలను, ప్రభుత్వ విద్యాసంస్థలను వేధిస్తున్న పనులన్నీ ఈ వేసవి సెలవుల్లో తక్షణమే పూర్తి చేయించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను,విద్యా శాఖ మంత్రులకు బాధితుల బంధువు,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎంఎల్) సెక్రటరీ, కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 విజ్ఞప్తి చేశారు.