నల్లగొండ జిల్లా:మెతుకులు పెట్టే వారికేది బ్రతుకు? అన్నదాతల అప్పుల సాగుకు విముక్తి మార్గమేదీ? కొండల్లా అప్పులు,కుంగిపోతున్న అన్నదాతలు.అప్పులు తీర్చే దారి కనిపించకనే అన్నదాతల ఆత్మహత్యలు కావవి రైతు కూలీల బలవన్మరణాలు పాలకులు చేస్తున్న హత్యలు.
అన్నదాత ఇంట మృత్యు గంటలపై బోర సుభాషన్న కన్నీటి లేఖ దారుణాలకు బలవుతున్న అన్నదాతలను ఆదుకోండి ప్రధానమంత్రికి ప్రజాబంధువు బోరన్నగారి సుభాషన్న బహిరంగ లేఖ.
ఒకసారి కాకపోతే,మరొకసారి కాలం కలిసొస్తుందనే ఆశతో అప్పులపై అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే చివరకు చిల్లిగవ్వ కూడా దక్కడం లేదని,వరస వైపరీత్యాలతో సాగు కలిసిరాక తెలుగు రాష్ట్రాల రైతులు దిగాలు చెందుతున్నారని ప్రజాబంధువు అవార్డు గ్రహీత,నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటయోధుడు,సిపిఐ (ఎంఎల్) కార్యదర్శి కామ్రేడ్ బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీకాకుళం నుండి సిరిసిల్ల దాకా,అనంతపురం నుండి అదిలాబాద్ దాకా తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతును కదిలించినా లక్షలాది రూపాయల అప్పుల పాలయ్యామనే ఆవేదనే వినిపిస్తోందని విప్లవోద్యమ నేతాజీ బోరాన్న బాధితుల గోడు వినిపించారు.ఈ మేరకు భారతదేశ ప్రధానమంత్రికి బహుజన నేస్తం బోరాన్న నేడొక బహిరంగ లేఖ వ్రాస్తూ ప్రకృతి ప్రతికూలతతో వ్యవసాయంలో వరుస నష్టాలు, బ్యాంకులు,ప్రైవేట్ వ్యక్తుల వద్ద పేరుకుపోయిన అప్పులు వాటిని తీర్చాలని రుణదాతల నుంచి ఒత్తిళ్లు,చేతిలో చిల్లిగవ్వ లేక,వ్యవసాయ సాగుకు పెట్టుబడులు పుట్టక,కుటుంబపోషణ భారంగా మారి అన్నదాతలు మానసిక క్షోభకు గురవుతున్నారని, ఆత్మాభిమానం చంపుకోలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని ప్రజా నేస్తం బోరాన్న ఆవేదన వ్యక్తం చేశారు.
రుణభారం రైతుల పాలిట మరణ శాసనంగా మారుతోందని,ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతల ఇళ్లలో మృత్యుగంట మ్రోగుతుందని కరువు, అతివృష్టి,అనావృష్టి,వాతావరణం సహకరించకపోవడం పంటలు పండక,పండినా సరైనా గిట్టుబాటు ధరలు రాక,పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం,వడ్డీలు కట్టడానికే,మళ్లీ వడ్డీలకు అప్పులు చేయడం అప్పులు తీర్చలేక,ప్రత్యామ్నాయ జీవన మార్గాలు కానరాక రైతులు ఉసురు తీసుకుంటున్నారని ఉద్యమాల మాస్టర్జీ,మార్కీస్ట్-లెనినిస్ట్ పార్టీ కార్యదర్శి బోరా సుభాష్ చంద్రబోస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఉద్యోగికి సెలవులోచ్చినా,కంపెనీలకు తాళం పడినా, ప్రభుత్వాలే స్తంభించినా,ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరుగులెత్తే రైతన్నలు అప్పుల బాధలకు తాళలేక ఒక్కొక్కరుగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని,కొందరు పురుగుమందులు తాగి పంట పొలంలోనే నేలకొరుతుండగా,మరికొందరు ఉరేసుకుని ఉసురు తీసుకుంటున్నారని,గడిచిన ఐదేళ్లలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు లక్షలకు పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని సిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి బోర సుభాషన్న తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతును కదిలించినా లక్షలాది రూపాయల అప్పుల పాలయ్యామనే ఆవేదనే వినిపిస్తుందని,గత్యంతరంలేని పరిస్థితుల్లో మరోదారి కనిపించక కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే మనోధైర్యం కల్పించాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నాయని,రైతుల జీవితాలతో రాజకీయాలు నడపడం సిగ్గుచేటయినా విషయమని రైతు బాంధవుడు బోసన్న మండిపడ్డారు.ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని,అప్పులతో కుదేలై పోతున్నాడని,బాధ్యతలతో కుంగిపోతూన్నాడని, రైతుకున్న ఆస్తి ఆధారం పంటభూమేనని,ఆ పొలాన్ని సైతం మరోదారి లేక తెగనమ్ముతున్నాడని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊరికల్ గ్రామానికి చెందిన నిరంతర శ్రమ జీవి,ఆదర్శ రైతు తన తండ్రి బోర చంద్రన్న యాదవ్ 9701487102 చెప్పిన మాటలను ప్రభుత్వాలకు వ్రాసిన లేఖలో బోరన్న పేర్కొంటూ పొలంలేని రైతంటే,ఆత్మలేని శరీరమేనని,జీవచ్ఛవంలాంటి బాధాకర పరిస్థితులను అన్నదాతలు ఎదుర్కొంటున్నారని రైతు నేస్తం బోరా సుభాషన్న బాధను వ్యక్తం చేశారు.
చిన్న కమతాలు,నిధుల కొరత,ఆధునిక పద్ధతుల మీద అవగాహన లేకపోవడం,నకిలీ విత్తనాలు,ఎరువులు,రసాయనాల ముఠాల చేతిలో మోసపోవడం,గిట్టుబాటు ధర రాక పోవడం,మార్కెటింగ్ నైపుణ్యం కొరవడడం లాంటివి భారతీయ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా ప్రధానమంత్రికి వ్రాసిన బహిరంగ లేఖలో ప్రజా సేవకుడు బోర సుభాన్న పేర్కొన్నారు.కార్లు,సిగరెట్లు,మద్యం,గుట్కా,డ్రగ్స్,సినిమాలు, రియల్ ఎస్టేట్స్ లాంటి ఎన్నో రకాల వ్యాపారులకు వేలకోట్ల లాభాలు వచ్చి పడుతుంటే సమాజంలో ఆకలిని తీర్చే కనిపించే దేవుడైన కర్షకుడు నిత్యం ఎందుకు విలపిస్తున్నారని ప్రభుత్వాలను ప్రజా ఉద్యమ నేత బోర సుభాషన్న ప్రశ్నించారు.
సినిమాలు చూడకపోయినా,సిగరెట్లు త్రాగకపోయినా, మద్యం ముట్టకపోయినా,కార్లలో తిరగకపోయినా, స్మార్ట్ ఫోన్స్ లో చాటింగ్ చేయకపోయినా, హాయిగానే,ఆరోగ్యంగానే బ్రతుకవచ్చునని అభ్యుదయవాది బోరాన్న పేర్కొన్నారు.కానీ,అన్నం లేకపోతే,తిండిగింజలు లేకపోతే,కూరగాయలు లేకపోతే ఒక్క రోజు కూడా బ్రతకలేమని, అలాంటప్పుడు నిత్యావసరాలని పండించే రైతులకు ఇన్ని కష్టాలు ఎందుకని పాలకవర్గాలను ప్రజానేస్తం బోసన్న 9848540078 ప్రశ్నించారు.
వ్యవసాయం అనే పదంలోనే’సాయం’ఉందని,అగ్రికల్చర్ అనే మాటలో’కల్చర్’ఉందని,ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క వ్యక్తి రైతు మాత్రమేనని రైతు బిడ్డ బోర సుభాషన్న పేర్కొన్నారు.వ్యయం పెరిగినా సాయం మరువని వాడు,పొలంలో నడుంవంచి దేశానికి వెన్నెముకగా నిలిచేవాడు రైతు, కానీ,రైతులకు మేలు జరిగే రోజులు ఎప్పుడు వస్తాయని కమ్యూనిస్ట్ నేతాజీ బోరాన్న ప్రశ్నించారు.
దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునే దాకా వెళ్లాడాంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనుకోవాలి.అలాంటి వారి కోసం విధానాలు రూపొందించే ప్రభుత్వ యంత్రాంగానికి అసలు కారణాలు పట్టడం లేదని,ఆత్మహత్య వెనుక వాస్తవాలను పాలకులు చూడటం లేదని,చివరకు రైతుల సంక్షేమం పట్ల ప్రతిపక్షాలకు,ప్రచార సాధనాలకు సైతం చిత్తశుద్ధి లేదని కామ్రేడ్ సుభాషన్న ఆరోపించారు.
పత్రికలలో,టీవీ మీడియాలలో రైతుల బ్రతుకుల గురించి ఏనాడు కూడా ప్రత్యేక కథనాలు రావడంలేదని,కానీ,శ్రీరెడ్డి అనే సినిమా ఆర్టిస్ట్ బట్టలిప్పుకుని బజారులో నగ్న ప్రదర్శనలు చేస్తే లైవ్ లు పెట్టడం మీడియా దిగజారుడుతనానికి నిదర్శనంగా సుభాషన్న పేర్కొన్నారు.పెట్టుబడిదారుల కట్టుకథలకు పుట్టిన విషపు పత్రికలకు రేటింగ్ తప్ప పేదలు,రైతుల సంక్షేమం పట్టదా? అని బోర సుభాషన్న ప్రశ్నించారు.అప్పుల బాధలు,బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు స్వాంతన పొందితే, వాటన్నిటిని నెరవేరుస్తున్నది చనిపోయిన రైతుల భార్యలు,తల్లిదండ్రులేనని,రైతు చేసిన అప్పులు తీర్చి,పిల్లలకు చదువులు చెప్పించి,పెళ్ళిళ్ళు చేసే వరకు ఎన్నో కష్టాలు పడుతున్నారని,ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అతడి కుటుంబం తీవ్రమైన బాధలను భార్య,పిల్లలు మోయాల్సి వస్తుందని బోర సుభాషన్న బాధను వ్యక్తం చేశారు.1995 వ సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గరలో గల ఆత్మకూర్ (ఎస్) మండలం,ఏపూరు గ్రామానికి చెందిన రైతు,తన తాతగారైన మున్న లింగయ్య,గంగమ్మ యాదవ్ లు చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ,ఈరోజు ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటూ, రేపటి తిండికోసం ఆలోచించే రైతుల జీవితం అర్థం చేసుకోవాలంటే రైతు బిడ్డలకే సాధ్యం తప్పా సేద్యం విలువ తెలియని సోమరిపోతులకు,కార్పోరేట్ వ్యాపారులకు ఎప్పటికీ రైతుల విలువ తెలియదని, పెట్టుబడిదారుల దోపిడీకి గులాంగిరి చేసే పాలకవర్గాలకు రైతుల బాధలు పట్టవని ప్రజా ఉద్యమకారుడు బోర సుభాషన్న తెలిపారు.కష్టపడి పండించే కర్శకుడికి ఆత్మ గౌరవం ఉంటుంది.అప్పు ఇచ్చిన వ్యక్తి గట్టిగా అడిగితే తట్టుకోలేడు.ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వేరే చోటుకు పారిపోవాలని అనుకోరు.భూమిని నమ్ముకుని బతుకుతాడు.
ఎందుకంటే రైతంటే నమ్మకం.రైతంటే నిజాయితీ అని చెప్పిన మేనమామ మున్నా గురువయ్య రామనర్సమ్మల 9948562850 మాటలను బోసన్న లేఖలో ప్రస్తావించారు.
అన్నదాత లేకుంటే మెతుకే ఉండదని,ఎన్ని పరిశ్రమలు పెట్టినా, ఎన్ని వ్యాపారాలు చేసినా,పంట ఉత్పత్తికి శ్రమించే రైతు బ్రతుకు పచ్చగా ఉండటానికి ప్రభుత్వాలు వట్టి మాటలు ప్రచారం కోసం చెబుతున్నాయి తప్పా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని బోర సుభాషన్న ఆరోపించారు.రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులేమిటో శాస్త్రీయంగా పరిశీలించి ఆత్మహత్యలు కొనసాగకుండా నిరోధించాల్సిన ప్రభుత్వాలు కేవలం మొక్కుబడి సహాయం చేసి చేతులు దులుపు కుంటుందని బోరన్న ధ్వజ మెత్తారు.
తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం నేడొక శాపంగా పరిణమించిందని,వ్యవసాయం కాకా మరేదైనా జీవన విధానం ఎన్నుకో గలిగితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులందరూ వ్యవసాయాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని బోరాజీ తెలిపారు.పెద్ద రైతులు సైతం లక్షలాది రూపాయలు లంచాలు ఇచ్చి అయినా తమ పిల్లలకు గుమస్తాగానో,మరే చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకైనా, ప్రైవేటు చిన్నపాటి కొలువులకైనా పంపడానికి సిద్ధపడుతున్నారే తప్పా రైతులుగా జీవితం కొనసాగించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదనే విషయాన్ని చెప్పిన ఎమ్మార్పీఎస్ నేత మేడి పాపన్న మాదిగ 7989253043 మాటలు అక్షర సత్యాలుగా కామ్రేడ్ సుభాషన్న అభివర్ణించారు.
వ్యవసాయం చేస్తున్న యువకుల కైతే పెళ్లి సంబంధాలు రావడంలేదని,గ్రామాల్లో చాలా మంది యువకులు బ్రహ్మచారులుగా ఉంటూ పెళ్లి కాని ప్రసాద్ లా అవహేళనకు గురవుతున్నారని రైతు సంఘం అధ్యక్షుడు వేల్పుల అంజన్న యాదవ్ 9848218099 ఆవేదన పాలకులకు పట్టడంలేదని బోరన్న పేర్కొన్నారు.ఇప్పటికే వేలాది కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలి పట్టణాల్లో వాచ్ మెన్ లగానో, భవన నిర్మాణ కార్మికులుగానో పని చేయడానికి పట్టణాల బాట పట్టాయని సుభాషన్న తెలిపారు.
ఏడవడం నేర్చుకున్నోడే వ్యవసాయం చేస్తాడని తన తాత బోర కొమురయ్య యాదవ్ చిన్నప్పుడు ఎందుకు చెప్పేవాడో అర్థం కాలేదని నేడు గ్రామాల్లో రైతుల దీనగాధలు చూస్తుంటే తాత చెప్పిన మాటలు అక్షర సత్యాలు కనపడుతున్నాయని కార్మిక కర్షక పోరాటయోధుడు బోర సుభాషన్న పేర్కొన్నారు.కళ్ళనిండా గింజలున్న పళ్లెం నిండా మెతుకులు లేక అన్నదాతలు తల్లడిల్లుతున్నారని,అన్నం గెలిచింది.
కానీ,అన్నదాత ఓడిపోతున్నాడు అని బోర సుభాషన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.పాలకులారా కర్షకుడి కన్నీటి అభివృద్ధిని కూడా మహా అభివృద్ధిగా దేశం వెలిగి పోతున్నట్లుగా ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారని బోసన్న 8328277285 ప్రభుత్వాల్ని ప్రశ్నించారు.
హరిత విప్లవం కారణంగా ఆధునిక వ్యవసాయానికి అంకురార్పణం జరిగినప్పటికీ, హరిత విప్లవం మాటున అన్నదాతల కష్టాలు మొదలైనావని బోస్ పేర్కొన్నారు.సంప్రదాయ పంటలైన జొన్న,సజ్జ,కొర్ర,రాగులతోపాటు పప్పు ధాన్యాలు,నూనెగింజల పంటలకు ఆదరణ తగ్గడంతోపాటు ఈ పంటల విస్తీర్ణం క్షీణించడంతోపాటు మన ఆహారంలో పోషకాహార స్థాయి పడిపోయిందని,గ్రామీణ భారతదేశంలో ఆరోగ్య సమస్యలు రానురాను పెరిగిపోతున్నాయని బోసన్న పేర్కొన్నారు.
ప్రభుత్వాలు విద్య,వైద్యంను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల పేదలు,రైతు,కూలీలు కష్టపడి సంపాదించిన సొమ్మునంతా ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ హాస్పిటల్స్ నిట్టనిలువునా దోచుకు పోతున్నాయని సుభాషన్న బహిరంగ లేఖలో పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పేరిట పెద్ద దోపిడి జరుగుతుందని,పంటలు పండే భూములను రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు,హాస్పిటల్స్ యజమాన్యాలు,డాక్టర్స్,ప్రభుత్వ ఉద్యోగులు,ఫార్మా కంపెనీల ఇతర పెట్టుబడిదారులే అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారని బోరన్న ఆరోపించారు.
పొలం రైతు ఆస్తి మాత్రమే కాదు ఆత్మాభిమానంగా పేర్కొన్న బోరన్న రియల్ ఎస్టేట్ దళారుల బ్రమల్లో పడి బంగారంలాంటి భూమిని అమ్ముకో వద్దని హితవు పలికారు.లక్షలకు లక్షలు వచ్చేస్తుండటంతో చాలామంది భూములు అమ్ముకుంటున్నారని, నడమంత్రపు సిరి ఎక్కువ కాలం నిలవదని మా అమ్మమ్మ అమరజీవి మున్న గంగక్క ఎప్పుడు చెబుతుండేదని బోసన్న పేర్కొన్నారు.
డబ్బు కరిగిపోవడానికి ఎక్కువకాలం పట్టదని,ఏవో వ్యసనాలు చుట్టుముడతాయని,చివరకు రైతు జీవితం నుండి దినసరి కూలీగా మారాల్సిన దుర్భర జీవితం దాపురిస్తుందని సుభాషన్న తెలిపారు.తన మేనమామ సూర్యాపేట ఏపూరు గ్రామంలో మున్న లింగ మల్లయ్య యాదవ్ బంగారం లాంటి భూమిని అమ్ముకుని చివరకు నిరుపేదగా మారి 2017 ఏప్రిల్ 15న మనోవ్యధకు గురై అమరుడైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బోసన్న కన్నీరు పెట్టారు.
సాంప్రదాయ పంటలకు తిలోదకాలు ఇవ్వడం,వ్యాపార పంటలను ప్రోత్సహించడం ఫలితంగా వరి, గోధుమలతో పాటు మిర్చి,పత్తి పంటల్లో భారీ దిగుబడులు సాధించిన ప్రగతి కొన్ని రంగాలకే పరిమితం కాగా అది తెచ్చిన అనర్ధాలు, అనారోగ్యాలు,అప్పులు,నష్టాలు ప్రజాదర్బార్లో చర్చ పెట్టవలసిన అవసరం ఉందని ప్రజానేస్తం సుభాషన్న పేర్కొన్నారు.దేశానికి ఆహార ధాన్యాలు అందించే రైతులు ఒక పూట తిండికి నోచుకోలేని పరిస్థితులు ఎందుకు దాపురించాయో ప్రభుత్వాలే వివరించాలని విప్లవ నేతాజీ సుభాషన్న కోరారు.
రాత్రనకా,పగలనకా ఏటికి ఎదురీది ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్న విపత్తులతో విలవిలలాడుతున్నడని,విత్తు విత్తింది మొదలు ఏదో ఒక దశలో వెంటాడుతున్న విపత్తుల వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంటే రైతుల్ని ఆదుకోవాల్సిన సమగ్ర పంటల బీమా పథకం లోపాలమయంగా మారిందని సుభాషన్న పేర్కొన్నారు.దేశంలో ఫసల్ భీమా అమలు తీరు తెన్నులు చూస్తే కష్టకాలంలో ఆదుకోని పంటల బీమాగా,రైతుకు భరోసా ఇవ్వని పథకంగా సుభాషన్న అభిప్రాయపడ్డారు.1985లో ప్రవేశపెట్టిన పంటల భీమా పథకం నేటికీ పనికిరానిదిగానే మిగిలిపోయిందని,రైతుల్ని ఆదుకోని ప్రభుత్వాల వైఫల్యం,లోపల మయంగా మిగిలిపోయిందని బోసన్న పేర్కొన్నారు.కడగండ్ల సేద్యం,గిట్టుబాటు కాని వ్యవసాయం,కష్టకాలంలో ఆదుకోని ప్రభుత్వ పథకాలు,ఏటా తప్పని నాసిరకం విత్తనాల గండం, అమలుకు నోచుకోని దగాకోరు పాలకుల ఎన్నికల హామీలు,ఉత్పాదకలో వెనుకబాటు,పురుగు కాటుకు, కలుపు మొక్కలకు,భానుడి సెగలకు తగ్గుతున్న దిగుబడులు,పెరుగుతున్న పెట్టుబడి సాగు ఖర్చులు రైతుల కన్నీళ్ళకు కారణంగా బోర సుభాషన్న పేర్కొన్నారు.
మా తాత మున్న లింగన్న యాదవ్ చెప్పినట్లు బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెడుతుందో ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు నాయకులు అలా పరిగెత్తాలి.వారే నిజమైన ప్రజా సేవకులు.
కానీ,రైతులు చస్తుంటే కూడా కనీస పరామర్శకు రాకపోవడం చూస్తుంటే బాధ కలుగుతుందని బోసన్న పేర్కొన్నారు.ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వమిచ్చే చిన్నపాటి ఆర్థిక సహాయాన్ని సైతం అప్పులిచ్చిన బ్యాంకులు లాగేసుకుంటుంటే,పొలాన్ని అమ్మి మిగతా అప్పులు తీర్చాలని ప్రైవేటు వ్యక్తుల ఒత్తిళ్లు వస్తున్నాయని దీంతో ఏ అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడో అవే సమస్యలు కుటుంబీకులను వెంటాడుతున్నాయని సుభాషన్న తెలిపారు.
రైతులు ఆత్మహత్య చేసుకున్న సమయంలో చాలాచోట్ల అధికారులు కనీస పరామర్శకు కూడా రావడంలేదని,కార్యాలయాల్లో కూర్చుని పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా నివేదికలు రూపొందిస్తున్నారని బోర సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా విమర్శించారు.ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు ఎన్నికల సమయంలోనే రైతేరాజు అని గొప్పలు చెబుతారు తప్పా కష్టకాలంలో కనపడరని,రైతు ఆత్మహత్య కుటుంబాలను పలకరించడం లేదని సుభాషన్న తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న 97 శాతం మందికి పోలీస్,రెవెన్యూ,వ్యవసాయాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ నివేదికలే ఇవ్వడం లేదని,వందమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముగ్గురు కుటుంబాలకు మాత్రమే నష్ట పరిహారం అందుతుందని మిగిలిన కుటుంబాలను విస్మరించడం బాధాకరమని బహుజన బంధువు బోరా సుభాష్ పేర్కొన్నారు.తెలంగాణ,ఆంధ్రాలో 50 శాతం వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుల కష్టాలు,కన్నీళ్లు ఎవరికీ పట్టడం లేదని, కనీసం వారి చావులు సైతం రైతుల ఆత్మహత్యల జాబితాలో చేరడం లేదని సుభాష్ అన్న తెలిపారు.
భూములను సాగుచేస్తున్న కౌలు రైతు,రైతు ఎందుకు కాడని బోరన్న ప్రశ్నించారు.అన్నదాతలను అప్పుల సాగు నుండి విముక్తి చేయాలని,రైతుల అప్పులన్నింటిని రద్దు చేసి కొత్తగా వడ్డీలేని అప్పులు ఇవ్వాలని,ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని,భూమిని కోల్పోయిన వారికి మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని, ప్రభుత్వం అన్ని రకాల వసతి గృహాల్లో రైతు అమరవీరుల పిల్లలకు ప్రవేశం కల్పించాలని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బోర సుభాషన్న భారత ప్రధానమంత్రిని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు.
వ్యవసాయాభివృద్ధికి సిసలైన కొలమానం పంటల ఉత్పాదకత,ఉత్పత్తిలో పెరుగుదలే కాకుండా రైతు,కూలీల నికరాదాయాల పెరుగుదల మరియు వారి కళ్ళల్లో ఆనందం కొలబద్ద కావాలని తన గురువు అమరుడు కామ్రేడ్ మారోజు వీరన్న చెప్పిన మాటలను కార్మిక రాజ్య స్థాపన స్వప్నికుడు బోర సుభాషన్న బహిరంగ లేఖలో గుర్తు చేశారు.చెమట చుక్కలను ధాన్యపు రాశులుగా మార్చి,బురద నుండి బువ్వదీస్తున్న రైతన్న కన్నీళ్లు దేశానికి మంచిది కాదని,ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ ప్రగతి సాధించిందనే సత్యాన్ని పాలకులు గ్రహించాలని బోర సుభాషన్న కోరారు.
పొద్దున్నే లేచి,పొలం బాటపట్టి,ఆరుగాలం శ్రమించి, ప్రజల ఆకలి తీర్చే రైతన్న నేడు ఆలి పుస్తెలు అమ్ముకుంటున్నాడని,ఆస్తులు తాకట్టు పెడుతున్నాడని,చివరకు పురుగుల మందే పెరుగన్నంలా తనువు చాలిస్తున్నాడని బోరన్న పేర్కొన్నారు.ఒక్క మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్టం,బిడ్డను పుట్టించడానికి తల్లి పడే పురిటి నొప్పులలాంటిదని బోస్ పేర్కొన్నారు.
మనుషులందరూ భూమి మీద తిరుగుతారంతే,రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడని,ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా, నేల మీదే ఆధారపడాలి,కానీ,నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుందని రైతునేస్తం సుభాషన్న తెలిపారు.చెమట చుక్కలతోనే నేలను తడుపుతూ, మట్టిలో బతుకుతూ,మనందరి కోసం పైరును ప్రాణంగా కొలుస్తూ కష్టపడి సాగుచేస్తున్న కర్షకుడు గిట్టుబాటు ధర లేక రోదిస్తున్నాడని,అందరికీ అన్నం పెట్టే రైతులు మాత్రం పురుగుమందులు సేవిస్తుండటం దేశానికి దుర్భిక్షమని రైతు శ్రేయోభిలాషి సుభాషన్న పేర్కొన్నారు.
దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతుల జాబితాలలో చోటు సంపాదిస్తుంటే,దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి ఎక్కుతున్నారని,ఇదేనా నా దేశం సాధించిన ప్రగతి అని ప్రజా బంధువు బోర సుభాషన్న ప్రశ్నించారు.పేదరికం,ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు,అనారోగ్యం,సాగేతర అప్పుల వంటి కారణాలను విచారణ నివేదికలో రాసి రైతుల చావులను తప్పుడు రాతలు రాసే ఏసీలలో బ్రతికే రాజకీయ రాబందుల్లారా ఇకనైనా మారండని, అన్నదాతల ఆత్మ ఘోష వినాలని సుభాషన్న కోరారు.
రైతుబంధు,రైతు భరోసాలతోనే సరి పెట్టడం కాదు,రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధరలు కల్పించాలని,నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ప్రభుత్వాలే ఉచితంగా సరఫరా చేయాలని ప్రజా ఉద్యమకారుడు బోర సుభాష్ చంద్రబోస్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.రైతు బతుకులు మార్చాల్సింది చిత్రాల్లో కాదని,రైతు బతుకులు వ్యవసాయ క్షేత్రంలోనేనని బోసన్న హితవు పలికారు.