సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలవిద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని( CM Breakfast Scheme ) శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సూర్యాపేట ఎమ్మెల్యే,రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా ( Nalgonda District )వ్యాప్తంగా 3139 పాఠశాలలో 2,48,409 విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనున్నట్లు తెలుస్తోంది.