భువనగిరి జిల్లా:కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శ్యామసుందర్ అధ్వర్యంలో వలిగొండ మండల నాయకులు శుక్రవారం వలిగొండ రైల్వే స్టేషన్లలో నారాయణద్రి,జన్మభూమి, నర్సాపూర్,విశాఖ,చెన్నయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపడానికి అనుమతి ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలో రైలు ఆపడం వలన చుట్టుప్రక్కల మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని,అదే విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు,వ్యాపారస్తులకు, ఉద్యోగులకు,రైతులకు సౌకర్యంగా ఉంటుందని మంత్రికి తెలియజేసినట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య గౌడ్ ,సీనియర్ నాయకులు బందారపు లింగస్వామి, కర్నాటి ధనంజయ,మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్,బీజేవైఎం మండల అధ్యక్షులు రేగురి అమరేందర్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.