నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ ( Nakrekal Assembly constituency )పరిధిలోని నార్కేట్ పల్లి మండల కేద్రంలోని శబరి గార్డెన్ లో సోమవారం నిర్వహించిన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్య్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) ముఖ్యాతిథిగా హాజరై 106 మంది లబ్ధిదారులకు చెక్కులను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు( Welfare schemes ) అందుతాయని,ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామని, మిగతావి కూడా అనుకున్న సమయంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పదేళ్లు అధికారంలో ఉండి అన్ని వర్గాల ప్రజలను విస్మరించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.